సూర్యాపేట జిల్లా: కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కొన్ని కాలి బూడిదవగా,కొన్ని పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా జరిగి ఉండొచ్చా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.