సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడల్లో భాగంగా పరుగు పందెం సీనియర్స్ విభాగంలో మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సోమపంగు శ్రీకాంత్ కు జిల్లా స్థాయి ప్రథమ బహుమతి దక్కింది.శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవంలో ఆయన జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతిపద్మ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరుగు పందెంలో పాల్గొని మంచి ప్రతిభ కదుపరిచినందుకు శ్రీకాంత్ కు ప్రత్యేక అభినదనలు తెలిపారు.ఆయన భవిష్యత్తులో మరెన్నో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మరెన్నో బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని దివ్యాంగులు,అధికారులు పాల్గొన్నారు.