విద్యుత్ షాక్ తో రైతు మృతి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం( Neredcherla manda ) ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు పొలంలో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేరేడుచర్ల ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాలు ప్రకారం… ముకుందాపురం గ్రామానికి చెందిన గజనబోయిన సైదులు గౌడ్(39) శుక్రవారం మధ్యాహ్నం కల్లూరు రెవిన్యూ పరిధిలోని పొలం కరిగట్టు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ మోటార్( Electric motor ) స్టార్టర్ వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 Farmer Dies Due To Electric Shock, Farmer , Died, Electric Shock, Neredcherla-TeluguStop.com

మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కూతురి వివాహం కాగా, కుమారుడు 10వ,తరగతి చదువుతున్నాడు.

జరిగిన ఘటనపై భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube