సుమన్ యువసేన సేవలు ప్రశంసనీయం: సూర్యాపేట డిఎస్పి నాగభూషణం

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కోర్టు చౌరస్తా వద్ద బాటసారుల సౌకర్యార్ధం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న సుమన్ యువసేన సేవలు ప్రశంసనీయమని సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అన్నారు.వేసవికాలంలో ఎండలు మండిపోతున్న వేళ కోర్టు చౌరస్తా నందు ప్రజల దాహార్తిని తీర్చడానికి సుమన్ యువసేన అధ్యక్షుడు గుండా వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం,మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం ప్రారంభించారు.

 Suman Yuva Sena's Services Commendable: Suryapet Dsp Nagabhushanam , Suryapet Ds-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్,ప్రధాన కార్యదర్శి పోలబోయిన నర్సయ్య యాదవ్,జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్ఐ క్రాంతి కుమార్, గోపవరపు రాజు,బొల్లం సురేష్,తల్లాడ వెంకటేశ్వర రావు,బోనగిరి విజయ్ కుమార్,కర్నాటి రంగయ్య, పాలవరపు రాజేష్, ఉప్పల శ్రవణ్ కుమార్, గుడిపాటి రమేష్, యామా రవికిరణ్,యామా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube