సూర్యాపేట జిల్లా:అభివృద్ధి నిరోధకులైన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలలో ఉండబట్టలేక ఇతర పార్టీ నేతలంతా స్వచ్ఛందంగా గులాబీ గూటికి చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో 24వ వార్డ్ కౌన్సిలర్ బత్తుల లక్ష్మీజాని యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి సైదా హుస్సేన్ 50 మంది బీజేపీ కార్యకర్తలతో గులాబీ గూటికి చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వేలాది కోట్ల రూపాయలతో తెచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మార్చినట్లు చెప్పారు.
అందుకే ఇతర పార్టీలలో ఇమడలేక అనేక మంది నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ వెంటే ఉంటామని పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.పార్టీలోని చేరిన వారు మాట్లాడుతూ 2014 కు ముందు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేక అన్ని రంగాలలో వెనుకబడిన దుస్థితి ఇక్కడి ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ,జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు.ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి పాలన కోనసాగుతుండటంతో టిఆర్ఎస్ పార్టీని అందరూ ఆదరిస్తున్నారని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,ఎంపీపీ నెమ్మాది బిక్షం, టిఆర్ఎస్ నాయకులు బత్తుల జానీ యాదవ్,కుంభం రాజేందర్,షేక్ జానిపాషా,అమరవాది శ్రవణ్,పరమేష్, వెంకటేష్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.