ఢిల్లీలో రైతులపై జరిగిన దాడికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

సూర్యాపేట జిల్లా:కనీస మద్దతు ధర చట్టం కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం దారుణంగా అణిచివేయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల పొట్ట కొట్టే విధానాలకు పాల్పడుతుందన్నారు.

 Modi Govt Should Be Responsible For Attack On Farmers In Delhi Former Mla Julaka-TeluguStop.com

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజలను విభజించి పాలిస్తుందన్నారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మోడీ అనుసరిస్తున్న విధానాల మూలంగా దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ సంపదను కొల్లగొడుతూ బడా కార్పొరేట్ శక్తులకు అప్పనంగా,అక్రమంగా ప్రజల సంపదను కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజా వ్యతిరేక,భూస్వామ్య విధానాలు,దొరల పాలనకు పాల్పడినందున తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు మాసాల కాలంలో మూడు పథకాలు మాత్రమే అమలు చేసిందన్నారు.మిగతా హామీలన్నింటికీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.రుణమాఫీ వెంటనే అమలుచేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.

రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube