సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్నే గ్రామ ఊర చెరువు కబ్జాకు గురవుతుందని,ఊర చెరువును కాపాడాలంటూ నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఊట్కూరి భార్గవ్ సైదులు మరి కొందరు గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా భార్గవ్ సైదులు మాట్లాడుతుా
పెంచికల్ దిన్నే గ్రామలో ఊర చెరువు గతంలో దాదాపు 150 ఎకరాలు ఉండేదని,ఊరచెరువు చుట్టు ప్రక్కల పొలాల రైతులు (వ్యవసాయ దారులు) అట్టి చెరువు భూమిని తరచు కలుపుకుంటూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఊర చెరువు క్రింద దాదాపుగా 170 ఎకరాలు సాగు భూములు ఉన్నాయని,ఆ భూముల యెుక్క సన్న చిన్నకారు రైతులు ఆ ఊర చెరువుపై ఆధారపడి, చెరువు నీటితో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని చెప్పారు.కబ్జాదారుల నుండి ఊర చెరువును కాపాడి,రెవెన్యూ రికార్డుల ప్రకారం వాస్తవ భూమిని, గ్రామంలోని రైతులను కాపాడాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.
ఈ కార్యక్రమంలో సుంకర వెంకటేశ్వరరావు,సిరికొండ కృష్ణ,నాయిని సైదులు, సిద్దపంగ సైదులు, సిద్దపంగ శ్రీను,కందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.