సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండల కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు,పోలీస్ అధికారులు,గిరిజన సంఘం నాయకులు స్థానిక లంబాడ ప్రజలు హాజరై భోగ్ బండారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 Sant Sri Sewalal 284th Birth Anniversary Celebrations , 284th Birth Anniversary,-TeluguStop.com

ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు,బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని,సేవాలాల్ సూచించిన మార్గంలో నడవాలని కోరారు.సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సామాజిక విప్లవకారుడని, మూఢనమ్మకాలని నమ్మకూడదని ప్రబోధించారని గుర్తు చేశారు.

విభిన్నంగా ఉన్న జాతుల్ని అయన ఏకం చేసి ఐక్యతను చాటారని చెప్పారు.గిరిజనులందరూ సన్మార్గంలో నడుస్తూ మద్యానికి,దూరంగా ఉండి గిరిజన సంస్కృతిని కాపాడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube