2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. పోటీకి సై అంటున్న మరో భారత సంతతి నేత ..?

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వుండగానే.అప్పుడే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.

 Indian-american Republican Vivek Ramaswamy Considers 2024 Us Presidential Bid, I-TeluguStop.com

ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రముఖులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ట్రంప్ మరోసారి పోటీ చేయాలని గట్టి పట్టుదలగా వున్నారు.ఈయనతో పాటు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సైతం పోటీకి సైతం అంటున్నారు.

ఈ క్రమంలో ఆమె తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా చేయడానికి మరింత చేరువవుతున్నారు.హేలీ ఎన్నికల్లో పోటీ చేసే విషయానికి సంబంధించి తొలిసారిగా పోస్ట్ అండ్ కొరియర్ ఆఫ్ చార్లెస్టన్‌ బహిర్గతం చేసింది.

Telugu Biotech, Democratic, Indian American, Joe Biden, Republican, Ro Khanna, V

ఇప్పుడు అదే రిపబ్లికన్ పార్టీ నుంచి మరో భారత సంతతి నేత వివేక్ రామస్వామి సైతం అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు యత్నిస్తున్నారు.37 ఏళ్ల రామస్వామి బిలియనీర్.ప్రస్తుతానికి నిజనిర్ధారణ మిషన్‌లను ప్రారంభించి, అయోవాలో పలు ఈవెంట్‌లలోనూ అతను పాల్గొంటున్నాడు.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.

Telugu Biotech, Democratic, Indian American, Joe Biden, Republican, Ro Khanna, V

ఇకపోతే.కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన రో ఖన్నా కూడా అధ్యక్ష బరిలో నిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయన ఇటీవల సెనేట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పడంతో డెమొక్రాట్లు ఉలిక్కిపడ్డారు.

భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేయొచ్చనే చర్చ జరుగుతోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2028 అధ్యక్ష ఎన్నికల్లో రో ఖన్నా పోటీపడే అవకాశాలు వున్నాయట.గతంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఖన్నా కుండబద్దలు కొట్టేశారు.2024లో బైడెన్ పోటీ చేయకుంటే తనకు ఆ పదవి కోసం పోటీపడే ఆలోచన లేదని తెలిపారు.బైడెన్ బరిలో వుంటే ఆయనకు మద్ధతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube