సావిత్రిని "బ్రహ్మరాక్షసి" అని పిలిచిన ఎస్వీఆర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..

టాలీవుడ్( Tollywood ) మొదటి తరం నటులలో గొప్పవారు ఎవరు? అనగానే మనకు ముందుగా ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ గుర్తుకొస్తారు.వారి తర్వాత ఎస్‌.వి.రంగారావు పేరే వినిపిస్తుంది.నిజానికి ఆయన హీరోగా సినిమాలు చేయలేదు.విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.అయినా సరే మిగతా హీరోలందరికంటే గొప్ప పేరు తెచ్చుకున్నారు.అందుకు కారణం ఈ నటుడు ఎలాంటి క్యారెక్టర్‌ అయినా అందులో పరకాయ ప్రవేశం చేయగలడు.

గొప్ప నటన నైపుణ్యం ఉండటంవల్ల అతడిని ఒక హీరోగా ప్రేక్షకులు చూసేవారు.ఇప్పటికీ ఎస్వీఆర్ కి చాలామంది అభిమానులు ఉన్నారు.

ఆయన స్క్రీన్ పై కనిపిస్తే కల్లార్పకుండా అలాగే చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

మొదట పాతాళ భైరవితో ఎస్వీ రంగారావు( SV Ranga Rao ) ఆకట్టుకున్నారు.

తర్వాత అలాంటి ఎన్నో గొప్ప పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఎస్వీఆర్‌ ఆన్‌స్క్రీన్ లైఫ్‌యే కాదు ఆఫ్ స్క్రీన్ జీవితంలో కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది.

ఆయన జీవితంలో ఎన్నో వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి.కొందరు నటీనటులతో, దర్శకులతో అప్పుడప్పుడు విభేదాలు వచ్చేవి కానీ నటుడిగా ఆయనకు ఉన్న వాల్యూ ఏనాడూ తగ్గలేదు.

అంత గొప్ప నటుడతను.

Telugu Kv Reddy, Savitri, Shivaji Ganesan, Sv Ranga Rao, Svr, Svr Savitri, Tolly

కె.వి రెడ్డి ( KV Reddy )లాంటి దిగ్గజ దర్శకులు ఎస్వీ రంగారావుకు చాలా మంచి పాత్రలు ఇచ్చేవారు.అయితే ఎస్వీఆర్( SVR ) తన అద్భుతమైన నటనతో ఆ పాత్రలకే అందం తెచ్చేవారు.

ఈ గ్రేట్ యాక్టర్ ముందు మహానటి సావిత్రి కూడా తేలిపోయేది.ఆమెతో ఓ సీన్‌ చేయడానికి చాలామంది నటులు భయపడేవారు.

ఆమె తన కళ్లతోనే కొన్ని వందల భావాలను ఎక్స్‌ప్రెస్ చేయగలిగేది.అంత గొప్ప నటితో తాము సరితూగగలమా అని ఇతర యాక్టర్స్ ఆందోళన పడేవారు.

Telugu Kv Reddy, Savitri, Shivaji Ganesan, Sv Ranga Rao, Svr, Svr Savitri, Tolly

అలాంటి మహానటి సావిత్రితో ఒక రోజు ఓ తమాషా సంఘటన జరిగింది.ఓ తమిళ సినిమా షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ కూడా అయింది.ఆ మూవీలో సావిత్రి, శివాజీ గణేశన్‌, ఎస్‌.వి.రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు.ఆరోజు ఓ సీన్‌ షూట్‌లో ఈ ముగ్గురూ కావలసి వచ్చింది.

శివాజీ గణేశన్‌ ముందుగా చేరుకొని ఆ తర్వాత వచ్చిన ఎస్వీఆర్‌ పాదాలకు నమస్కరించి.‘ఈ ఒక్క సన్నివేశాన్నైనా నాకు వదిలిపెట్టరా రాక్షసుడా.

’ అని తమాషాగా అన్నాడట.ఆ మాటలు వినగానే ఎస్వీఆర్‌ విరగబడి నవ్వారట.

ఆ తర్వాత ‘ఒక్కసారి వెనక్కి చూడరా.అక్కడ బ్రహ్మరాక్షసి ఉంది.

మనిద్దరినీ గుటుక్కున మింగేస్తుంది’ అని సావిత్రిని చూపిస్తూ సరదాగా ఎస్వీఆర్ కూడా జోక్ చేశారట.ఆ మాట కాస్త సావిత్రి చెవిలో పడగానే ఆమె రాక్షసిలా వికటాట్టహాసం చేసి సెట్ లో ఉన్న వారందరినీ బాగా నవ్వించేసిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube