.ప్రస్తుతం కల్కి సినిమా( Kalki movie ) భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా 600 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిందంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రభాస్ గత చిత్రమైన సలార్ సినిమా( Salaar movie ) 750 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
మరి ఈ సినిమా 1000 కోట్లను మార్కు ను దాటుతుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇక ప్రస్తుతం మొదటి నాలుగు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు కల్కి సినిమా కలెక్షన్స్ కొంతవరకు తగ్గినట్టు గా అనిపిస్తున్నప్పటికీ సినిమా లాంగ్ రన్ లో మాత్రం మరింత కలెక్షన్లు అయితే సాధించే అవకాశాలు ఉన్నాయంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక కల్కి లాంటి ఒక భారీ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే దాని ద్వారా మరికొన్ని పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయి ఇలాంటి సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లందరికీ ఒక మార్గదర్శి గా నిలిచింది.
ప్రభాస్ ( Prabhas )లాంటి హీరో ఉన్నప్పుడు ఆ సినిమా మీద 1000 కోట్ల వరకైనా బడ్జెట్ పెట్టి సినిమా చేసే సాహసాన్ని చేయవచ్చు.
ఎందుకంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ అయితే ఉంది తను చేసిన బాహుబలి 2 సినిమా 2000 కోట్లు కలెక్షన్స్ ను రాబట్టింది.అలాగే సలార్ సినిమాకి 750 కోట్లు వచ్చినప్పటికీ ఆ సినిమా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టయితే 1000 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేది.కానీ ఆ సినిమాలో దర్శకుడు యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు.
మధ్యలో కొంతవరకు బోర్ గా అనిపించింది.అందువల్ల ఆ సినిమాకి రిపిటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా రాలేదు.
ఇక మరో వారం రోజుల్లో 1000 కోట్ల మార్కు దాటబోతుందంటూ సినిమా మేకర్స్ చెప్తున్నారు…