పేదలకు ఇళ్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ 

కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసే దిశగా అడుగులు ఇప్పటికే అనేక హామీలను నెరవేరుస్తూ ఉండగా,  పేదలకు ఇళ్ల పంపిణీ( Housing Scheme ) వ్యవహారం పైన తాజాగా ప్రకటన చేసింది.  పేదలకు ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు.

 Ap Govt Key Announcement Over Implementation Of Housing Scheme For Poor Details,-TeluguStop.com

  ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి( Minister Kolusu Parthasarathy ) అన్ని జిల్లాల అధికారులతోనూ సమావేశం నిర్వహించారు.

రాబోయే రోజుల్లో 100 రోజుల్లో లక్ష 28 వేల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.

మార్చి నెల ఆఖరి నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు.గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారనే ఫిర్యాదులు ఉన్నాయని,  వీటిపైన సమగ్రంగా విచారణ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని పార్థసారథి వివరించారు.  అలాగే ఇసుక సమస్య వ్యవహారం పైన స్పందించారు.

  ఎక్కడ ఇసుక సమస్య( Sand Problem ) ఉందొ అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఏపీలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకు పూర్తిచేసి తరువాత వదిలేసిన పరిస్థితిని గుర్తించామని , ఇటువంటి కంపెనీలపై జూలై 31 లోపు ఎంక్వయిరీ చేయాలని ఆదేశించినట్లు పార్థసారథి తెలిపారు.మరికొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్ళు కేటాయించాలని,  గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను కూడా వాడుకుంటామని ,  మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube