ఇటీవల బంగ్లాదేశ్‌కు( Bangladesh ) సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది.ఈ వీడియోలో, ప్రజలు మార్కెట్లో డబ్బు కట్టలను( Money ) అమ్ముతున్న దృశ్యాలు కనిపించాయి.
సాధారణంగా మనం ఏదైనా కూరగాయలను కొనుగోలు చేయడానికి మార్కెట్లకు వెళ్తాం, కానీ డబ్బు కూరగాయలు వల్లే ఇక్కడ కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది.సాధారణంగా డబ్బును మార్కెట్లో విక్రయించడం చట్టవిరుద్ధం.
ఎందుకంటే డబ్బును వస్తు, సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు, అమ్మడానికి కాదు.కానీ ఈ వీడియోలో, బంగ్లాదేశ్‌లో “నోట్ల మార్కెట్”( Money Market ) అని పిలిచే ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉందని మనం చూడవచ్చు.
ఇటీవల సోషల్ మీడియాలో, “fearlessnomadiker” అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పేరుతో వీడియోలు చేసే “రై హర్ష్” అనే వ్యక్తి షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరిచేస్తోంది.ఈ వీడియోలో బంగ్లాదేశ్‌లోని మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లుగానే డబ్బు నోట్లు అమ్ముతున్నారని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా ఉంది.ఇక్కడ చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లను మంచి నోట్లతో మార్చుకునేందుకు “నోట్ల మార్పిడి దుకాణాలు” ఉంటాయి.
వీటి నిర్వాహకులు కొంచెం కమీషన్ తీసుకుని దెబ్బతిన్న నోట్లకు బదులుగా మంచి నోట్లు ఇస్తారు.
కానీ, బంగ్లాదేశ్‌లోని ఈ వీడియోలో చూపించిన దృశ్యం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.అక్కడ ఏకంగా కిరాణా దుకాణంలాగానే డబ్బు మార్పిడి( Money Exchange ) జరుగుతోంది.రై హర్ష్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే దీనిని 89 లక్షల మంది వీక్షించగా, 1.85 లక్షల లైకులు, 4 వేల 299 కామెంట్లు వచ్చాయి.
వీడియోపై ఒక వ్యక్తి వ్యాఖ్య రాశారు.అందులో, బంగ్లాదేశ్‌లోనే కాకుండా ఢిల్లీలో కూడా డబ్బు నోట్లను బహిరంగంగా అమ్ముతున్నారని.ఉదాహరణకు, ఒక వ్యక్తి 100 రూపాయల చిరిగిన నోటును ఇస్తే, దుకాణదారులు 80 లేదా 90 రూపాయలు మాత్రమే ఇస్తారని ఆ వ్యాఖ్యలో పేర్కొన్నారు.
బ్యాంకుల్లో కూడా నోట్ల మార్పిడి జరుగుతుంది, కానీ అక్కడ చాలా సేపు వేచి ఉండాల్సి ఉంటుంది.
అందుకే చాలా మంది ఈ దుకాణాలకు వచ్చి తమ నోట్లను మార్చుకుంటారని ఆ వ్యక్తి వివరించారు.