కెనడాలో తారాస్థాయికి గృహ సంక్షోభం.. చౌకైన ప్రాంతాల వైపు వలసదారుల చూపు

కెనడాను( Canada ) గృహ సంక్షోభం సమస్య తీవ్రంగా వేధిస్తోంది.ఇప్పటికే పరిస్ధితిని గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ వలసలు, విద్యార్ధి వీసాలపై జస్టిన్ ట్రూడో ( Justin Trudeau )ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 Housing Crisis In Canada Forcing Residents To Move Out Of Pricier Cities Poll ,-TeluguStop.com

అయితే నివాసితులు ఖరీదైన నగరాల నుంచి బయటకు వెళ్లడమే కాకుండా ఏకంగా వారిని దేశం నుంచే బలవంతంగా వెళ్లగొట్టడానికి ఒత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇటీవల వలసదారులు వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రావిన్స్ నుంచి పునరావాసంపై ఎక్కువగా ఆలోచిస్తున్నారని లాభాపేక్షలేని అంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్( Angus Reid Institute ) (ఏఆర్ఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

దీని ప్రకారం 28 శాతం మంది వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రావిన్స్‌ను విడిచిపెపట్టాలని ఆలోచిస్తున్నారని .ఆ సంఖ్య ఇటీవల 39 శాతానికి పెరిగిందని తెలిపింది.ముఖ్యంగా గ్రేటర్ టొరంటో ఏరియా( Greater Toronto Area ) (జీటీఏ) , మెట్రో వాంకోవర్ వంటి పట్టణ కేంద్రాల నుంచి దేశంలోనే చౌకైన ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్నారని వెల్లడించింది.దాదాపు 42 శాతం మంది కొత్త భూభాగానికి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని , వీలైతే కెనడా నుంచే నిష్క్రమించాలని ఆలోచిస్తున్నారని సర్వే తెలిపింది.దాదాపు 12 శాతం మంది కెనడియన్లు దేశం విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నారని.7.5 శాతం మంది అమెరికాకు మించిన గమ్యస్థానాన్ని చూస్తున్నారని పేర్కొంది.

Telugu Angusreid, Canada, Greatertoronto, Canadamove, Justin Trudeau-Telugu NRI

కెనడా ఇమ్మిగ్రేషన్ స్థాయిలు ఇటీవలి సంవత్సరాలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఏఆర్ఐ తెలిపింది.అయితే ఎక్కువమంది వలసదారులు విదేశాల నుంచి కెనడాలో స్థిరపడాలని నేటికీ కోరుకుంటున్నారని వెల్లడించారు.అలాగే చాలా తక్కువ మంది విదేశీయులే కెనడాలో ఇటీవల శాశ్వత నివాసితులుగా మారుతున్నారని సర్వే పేర్కొంది.2001లో ఇది 75 శాతంగా ఉండగా 2021లో అది 45 శాతానికి చేరుకుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్‌షిప్ ( Institute for Canadian Citizenship )నివేదిక పేర్కొంది.

Telugu Angusreid, Canada, Greatertoronto, Canadamove, Justin Trudeau-Telugu NRI

కెనడాలో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు.ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) డేటా ప్రకారం.ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మంజూరైన కొత్త పీఆర్‌లలో భారతీయులు 31 శాతం (51,450) పొందగా.గతేడాది ఆ సంఖ్య 29.6 శాతం (1,39,785).2015లో ఇది 14.5 శాతం (39,340)గా ఉంది.కానీ చాలా మంది వలసదారులు కెనడా నుంచి నిష్క్రమిస్తున్నారు.అధిక జీవన వ్యయం, గృహ సంక్షోభం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube