ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్లు( 600 crores box office ) సాధించడం సులువైన విషయం కాదు.అయితే సౌత్ ఇండియాలో తెరకెక్కిన చాలా సినిమాలు 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ ను షేర్ చేశాయి.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD movie ) బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.కల్కి సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
కల్కి సినిమాకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది.ఈ సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి2 ( Baahubali, Baahubali 2 )సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie )కూడా 600 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో 2.0 మూవీ( Robo 2.0 movie ) కూడా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా( KGF Chapter 2 Movie ) కూడా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది.
జైలర్ సినిమా కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలు తెరకెక్కనున్న నేపథ్యంలో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.టాలీవుడ్ సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది.టాలీవుడ్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది.టాలీవుడ్ హీరోలు రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతారేమో చూడాలి.