తమిళనాడు రాష్ట్రం, నామక్కల్‌లోని ( Namakkal, Tamil Nadu State )ఒక షాకింగ్ సంఘటన చోటు చేసింది.ఈ సిటీలో ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ బస్సులో శారద ( Sarada )అనే ఒక మహిళ ఎక్కింది.
శారద బస్సు డోర్ దగ్గర నిలబడి ఉంది.బస్సు ఒక టర్నింగ్ తీసుకున్నప్పుడు, ఆమె బ్యాలెన్స్ కోల్పోయి బస్సు నుంచి బయటకు ఎగురుతూ రోడ్డుపై పడిపోయింది.
ఈ ఘటనను చూసిన ఇతర ప్రయాణికులు హడవిడిగా బస్సు కండక్టర్‌కు తెలియజేశారు.దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపివేశాడు.గాయపడిన శారదను వెంటనే సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సరదా సేలంకు వెళ్లి బట్టలు కొని బస్సులో తిరిగి ఇంటికి వస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనను చూసిన ఇతర ప్రయాణికులు బస్సు కండక్టర్‌కు చెప్పి ఆపించారు.హడావుడిగా బస్సు దిగి దాదాపు 20 అడుగుల దూరంలో పడిపోయిన శారదాకు సహాయం చేశారు.
ఇలాంటి మరో ఘటన ఫిబ్రవరి 2024లో తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగింది.ఒక కండక్టర్ ఓ మహిళను కదిలే బస్సు నుంచి పడకుండా కాపాడాడు.ఆ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోలో, బస్సు నుండి పడిపోబోతున్న ఒక మహిళను కండక్టర్ ఆమె జుట్టు పట్టుకుని లోపలికి లాగుతున్నట్లు కనిపిస్తుంది.ఘటన జరిగిన తర్వాత, ఆ మహిళ తన వస్తువులను సేకరించి బస్సు ఆగిన వెంటనే దిగి, బస్సు కండక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది.