నెల్లూరు వెళ్లి చంద్రబాబు పై జగన్ విమర్శలు 

వైసిపి అధినేత జగన్( jagan ) టిడిపి కూటమి ప్రభుత్వంపై తొలిసారిగా.బహిరంగంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .

 Jagan Went To Nellore And Criticized Chandrababu, Tdp, Telugudesham , Chandrabab-TeluguStop.com

ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీనే లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు , కక్ష సాధింపు చర్యలపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు .రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి విధ్వంసాలకు దిగుతోందని జగన్ విమర్శించారు.  నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ( Pinnelli Ramakrishna Reddy )పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు.  వైసీపీ క్యాడర్ , నేతలను భయాందోళనకు గురిచేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని,  ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ పట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని,  ప్రతి వైసిపి కార్యకర్త ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని,  దొంగ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.

Telugu Ap, Chandrababu, Jagannellore, Telugudesham, Ysrcp-Politics

మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని,  ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు( CM Chandrababu ) తప్పించుకు తిరుగుతున్నారని జగన్ విమర్శించారు .ఖరీఫ్ సీజన్( Kharif season ) ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా.ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని , ఇంకా రైతులకు సాయం అందించలేదని జగన్ మండిపడ్డారు .తల్లికి వందనం ఇస్తామని చెప్పి బడులు ప్రారంభమైనా ఇవ్వలేదని విమర్శించారు .అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని జగన్ ఆరోపించారు.ఈ సందర్భంగా వైసీపీకి ఓటమికి గల కారణాలను జగన్ విశ్లేషించారు.

  ప్రజల్లో వ్యతిరేకత వల్లే వైసీపీ ఓడిపోలేదని , చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మడం వల్లనే వైసిపి ఓటమి చెందిందని జగన్ అన్నారు.

Telugu Ap, Chandrababu, Jagannellore, Telugudesham, Ysrcp-Politics

ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం పైన స్పందించారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ని అన్యాయంగా అరెస్టు చేశారని , ప్రజల్లో బలం ఉండబట్టే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని జగన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube