రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి పథకంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరిగేలా చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు పూర్తి కావస్తున్నా గృహ జ్యోతి పథకం గ్రామాల్లో పేదవారికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని,గ్రామాల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ జ్యోతి పథకం అమలు చేయాలన్నారు.
Latest Rajanna Sircilla News