రాత్రి తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి..!

ఈమధ్య కాలంలో చాలామంది బిజీ లైఫ్ వలన సరైన సమయానికి అన్నం తినడం లేదు.దీంతో చిన్న వయసులోనే అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు.

 Do Not Do These Things After Eating At Night , Health Tips, Health , Dinner, D-TeluguStop.com

అంతేకాకుండా కొంతమంది తిన్న వెంటనే పడుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు.దీనివల్ల చాలామంది బరువు పెరిగి అనేక ఇబ్బందుల పాలవుతున్నారు.

మరి రాత్రిపూట తిన్న వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈమధ్య కాలంలో ఆహారం, ఇతర జీవనశైలి ఎలా ఉన్నా కూడా మనం ఫీట్ గా ఉండాలన్నదే మన ప్రధాన అంశం.ఈ విషయంలో మనం తినే ఆహారాన్ని సరైన పద్ధతిలో ఉంచుకొని తప్పులు చేయకుండా ఉంటే మనిషి ఎప్పటికీ ఫిట్ గానే ఉంటారు.

Telugu Acid Reflux, Tips, Heartburn-Telugu Health

అయితే రాత్రి భోజనం( Dinner ) తర్వాత ఏ తప్పు చేయకపోతే 30 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఫీట్ గా ఉంటారు.కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఎక్కువ సమయం టీవీ లేదా మొబైల్( TV mobile ) చూడడంలోనే గడిపేస్తున్నారు.అయితే ఈ పద్ధతి అస్సలు సరైనది కాదు.దీని వలన చాలా ప్రమాదాలు వస్తాయి.ఇలా తిన్న వెంటనే మొబైల్ ఫోన్ లేదా టీవీ చూడడం వలన ఒత్తిడి హార్మోన్స్ స్థాయిలు పెరిగిపోతాయి.దీంతో రాత్రి నిద్ర సరిగా పట్టదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకునే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది.

Telugu Acid Reflux, Tips, Heartburn-Telugu Health

ఇది కూడా అసలు మంచి అలవాటు కాదు.దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎంజైములు విడుదల కాకుండా చేస్తుంది.దీని వల్ల జీర్ణ సమస్యలు( Digestive problems ) ఎక్కువైపోతాయి.

అలాగే వెంటనే బరువు పెరిగిపోతారు.కాబట్టి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం వంద అడుగుల దూరమైన నడవాలి.

అంతేకాకుండా కొంతమందికి రాత్రి భోజనం తర్వాత మద్యం లేదా సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది.దీని వలన కడుపులో యాసిడ్ రిప్లేక్స్, అజీర్ణం, గుండె మంట లాంటి సమస్యలు రావచ్చు.

కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి డిన్నర్ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube