ఏపీ ఎన్నికలకు ముందు , తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారు అన్న సంగతి తెలిసిందే.అసలు జనసేన, పవన్ సహకారం లేకపోతే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదని , పవన్ వల్లే ఇది సాధ్యం అయ్యిందని అనేకసార్లు చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు అవకాశం ఇవ్వడంతో పాటు, అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. టిడిపి, చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం తో పవన్ కూడా సంతోషంగానే ఉన్నారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది జనసైనికులు పవన్ కు టిడిపి అప్పుడే ప్రాధాన్యం తగ్గించడం మొదలు పెట్టిందని, అప్పుడే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పెడుతున్న పోస్టింగ్స్ చర్చనీయాంశం గా మారాయి.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోది తో( PM Narendra Modi ) ఏపీకి సంబంధించిన అనేక ప్రయోజనాల పైన చర్చించారు. అలాగే కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతున్నారు.
అయితే చంద్రబాబు తన వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తీసుకువెళ్లకపోవడంపై జనసేనలో చర్చనియాంశం గా మారింది పవన్ ను కూడా చంద్రబాబు వెంట తీసుకువెళ్తే మరింత బలంగా ఉండేదని చెబుతూ, తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) కూడా ఉన్నారు .ప్రధాన ని కలిసినా, కేంద్ర మంత్రులతో భేటీ అయినా , రేవంత్ రెడ్డి వెంట విక్రమార్క ఉంటున్నారు.
అలాగే పార్టీ అగ్రనేతలతో భేటీ అయినా ఆయన వెంట డిప్యూటీ సీఎం ను తీసుకువెళ్తున్నారు.కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తీసుకు వెళ్లకుండా, మిగతా మంత్రులను తీసుకువెళ్లడం పైనే జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎటువంటి అసంతృప్తి లేకపోయినా , జనసైనికులు మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని వద్దకు పవన్ ను తీసుకువెళ్తే రాష్ట్రానికి అధికంగా నిధులు, ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.
ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు అందించిన కరపత్రాలలో పవన్ ఫోటో లేదని , ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రకటనల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని, ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు పవన్ తీసుకువెళ్లకుండా ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం మొదలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఎటువంటి అసంతృప్తికి గురవకపోయినా , జనసైనికులు మాత్రం తమ బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.