నెల్లూరు వెళ్లి చంద్రబాబు పై జగన్ విమర్శలు 

వైసిపి అధినేత జగన్( Jagan ) టిడిపి కూటమి ప్రభుత్వంపై తొలిసారిగా.బహిరంగంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .

ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం వైసీపీనే లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు , కక్ష సాధింపు చర్యలపై జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు .

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి విధ్వంసాలకు దిగుతోందని జగన్ విమర్శించారు.  నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ( Pinnelli Ramakrishna Reddy )పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు.

  వైసీపీ క్యాడర్ , నేతలను భయాందోళనకు గురిచేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని,  ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ పట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని,  ప్రతి వైసిపి కార్యకర్త ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని,  దొంగ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.

"""/" / మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని,  ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు( CM Chandrababu ) తప్పించుకు తిరుగుతున్నారని జగన్ విమర్శించారు .

ఖరీఫ్ సీజన్( Kharif Season ) ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా.ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని , ఇంకా రైతులకు సాయం అందించలేదని జగన్ మండిపడ్డారు .

తల్లికి వందనం ఇస్తామని చెప్పి బడులు ప్రారంభమైనా ఇవ్వలేదని విమర్శించారు .అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని జగన్ ఆరోపించారు.

ఈ సందర్భంగా వైసీపీకి ఓటమికి గల కారణాలను జగన్ విశ్లేషించారు.  ప్రజల్లో వ్యతిరేకత వల్లే వైసీపీ ఓడిపోలేదని , చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మడం వల్లనే వైసిపి ఓటమి చెందిందని జగన్ అన్నారు.

"""/" / ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం పైన స్పందించారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ని అన్యాయంగా అరెస్టు చేశారని , ప్రజల్లో బలం ఉండబట్టే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని జగన్ అన్నారు.

ఈ ఇయర్ బాలీవుడ్ కి కంటి మీద కునుకు లేకుండా చేసిన మన స్టార్ హీరోలు వీళ్లే..?