స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) అంచెలంచెలుగా ఎదిగి తన పేరుతోనే సినిమాకు బిజినెస్ జరిగే స్థాయితో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ కు ఎక్కువగా విజయాలు లేవు.
ఒకానొక దశలో వరుస ఫ్లాపుల వల్ల ప్రభాస్ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే కల్కి సినిమాలో నటించిన అన్నాబెన్( Annaben ) ఈ సినిమా గురించి చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఒకె నెటిజన్ కల్కి సినిమాకు సంబంధించి ఇచ్చిన రివ్యూను అన్నాబెన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఆ పోస్ట్ లో అమితాబ్ సార్ ది లైఫ్ టైమ్ క్యారెక్టర్ అని చాలా ఆనందంగా అనిపించిందని ఆయనను తెరపై చూడటం కోసం కల్కి సినిమాను ( Kalki movie )మళ్లీమళ్లీ చూస్తుంటానని చెప్పుకొచ్చారు.
నాకు అమితాబ్ కనిపించిన ప్రతి సందర్భంలో కళ్లలో నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.కమల్ హాసన్ సార్ సెనేటర్ వైబ్స్ ఇచ్చారని తెలిపారు.
కమల్ హాసన్( Kamal Haasan ) తన పాత్రలో పర్ఫెక్ట్ గా నటించారని సినిమా మొత్తం స్టార్స్ వార్ లా అనిపించిందని నెటిజన్ పేర్కొన్నారు.సినిమా ప్రపంచానికి అభిమాని కావడం వల్ల కల్కి చూడటం మంచి అనుభూతిని కలిగించిందని నెటిజన్ చెప్పుకొచ్చారు.దీపికా పదుకొనే పాత్రలో లీనమైపోయిందని ఆమె అలా నటిస్తుందని అనుకోలేదని నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నా ఫేవరెట్ గర్ల్ బెన్నా లవ్, వాట్ ఏ ఫైర్ క్రాకర్ పర్ఫామెన్స్ అని పేర్కొన్నారు.ప్రభాస్ క్రింజ్ కామెడీ చాలా భయంకరంగా అనిపించిందని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు.అయితే అన్నాబెన్ మాత్రం చూసుకోకుండానే ప్రభాస్ గురించి నెగిటివ్ గా ఉన్న ఈ పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి పరువు పోగొట్టుకున్నారు.
కల్కి మూవీలో ఛాన్స్ ఇస్తే అన్నా బెన్ ఇలా చేయాలా అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.