న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌ : ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామమందిర నమూనా ..!!

ఏళ్ల తరబడి నిరీక్షణ, వివాదాలు, న్యాయ పోరాటాలు అన్నింటిని అధిగమించి శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) నిర్మాణం జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా జరిగింది.

 Ayodhya Ram Mandir Replica To Take Centre Stage At Nycs India Day Parade Details-TeluguStop.com

నాటి నుంచి రామయ్య దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు రాములోరిని దర్శించుకున్నారని అంచనా.

ఆగస్ట్ 18న 42వ న్యూయార్క్ ఇండియా డే పరేడ్( Newyork India Day Parade ) సందర్భంగా అయోధ్యలోని రామమందిర నమూనాను తొలిసారిగా అమెరికాలో ప్రదర్శించనున్నారు.18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్న ఈ రామమందిరాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిట్టల్( Amitabh Mittal ) వెల్లడించారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) నిర్వహించే ఇండియా డే పరేడ్.భారతదేశానికి వెలుపల జరిగే అతిపెద్ద భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుక.ప్రతి యేటా అమెరికా నలుమూలల నుంచి దాదాపు 1,50,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా.

Telugu America, Amitabh, Ayodhyaram, Indian, Indian American, York-Telugu NRI

ఈ పరేడ్‌లో విభిన్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీలు , సాంస్కృతిక వ్యక్తీకరణలను సూచించే కార్యక్రమాలు ఉంటాయి.అయితే ఈ ఏడాది రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకోవడం, దాని నమూనాను అమెరికాలో ప్రదర్శించాలని భావిస్తూ ఉండటంతో పరేడ్‌కు అదనపు ఆకర్షణగా భావిస్తున్నారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్( Federation of Indian Associations ) వెబ్‌సైట్ ప్రకారం.

భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యం తెలిసేలా కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, భారతీయ ఆహారం ఏర్పాటు చేశారు.

Telugu America, Amitabh, Ayodhyaram, Indian, Indian American, York-Telugu NRI

విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) ఇటీవల రామమందిర రథయాత్రను నిర్వహించిన సంగతి తెలిసిందే.60 రోజుల పాటు 48 అమెరికన్ రాష్ట్రాల్లో 851 దేవాలయాలను ఈ రథయాత్ర కవర్ చేసింది.తాజా పరేడ్‌లో అయోధ్య రామమందిర ప్రాజెక్ట్‌ను స్మరించడమే కాకుండా హిందూ వారసత్వం, మతపరమైన ప్రాముఖ్యత గురించి విభిన్న వర్గాలకు అవగాహన కల్పించడానికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube