భార్యను వదిలేస్తానన్న పూరి జగన్నాథ్.. ఆ చిన్న కారణానికే..??

ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు తీసి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు పూరి జగన్నాథ్.( Puri Jagannath ) ఈ దర్శకుడు తీసే చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లు చాలా మాస్ గా ఉంటారు.

 Puri Jagannath About His Wife Eating Details, Puri Jagannath, Director Puri Jaga-TeluguStop.com

ఇతడి సినిమాలోని లవ్ స్టోరీలు మస్త్ కిక్కెక్కిస్తాయి.అయితే ఇలాంటి ఒక అదిరిపోయే లవ్ స్టోరీ( Love Story ) పూరి జగన్నాథ్ రియల్ లైఫ్ లో కూడా జరిగింది.

ఆ లవ్ స్టోరీ మరేవరితోనో కాదు ఆయన ప్రస్తుత సతీమణి లావణ్య( Lavanya ) తోనే జరిగింది.

కెరీర్ తొలినాళ్లలో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు.

కొన్నిసార్లు ఘోస్ట్ డైరెక్షన్ కూడా చేశాడు.అంటే వేరే వారి పేరు కింద ఇతను సినిమాలను డైరెక్ట్ చేసి రూ.1,000 రూ.1,500 సంపాదించేవాడు.అయితే ఒక సినిమాకి ఆయన ఘోస్ట్ డైరెక్షన్ చేస్తుంటే ఆ షూటింగ్ చూసేందుకు లావణ్య వచ్చిందట.ఆ అమ్మాయిని చూడగానే పూరి జగన్నాథ్ ఫ్లాట్ అయిపోయాడట.గంటన్నర పాటు ఆమెనే చూస్తుంది పోయారట.ఆమె మాత్రం పూరి వైపు చూడనే లేదట.

Telugu Puri Jagannath, Lawanya, Purijagannath, Tollywood-Movie

చివరికి ఏం పూరి ఆమె వద్దకు వెళ్లి తనకు తెలిసినవారి విజిటింగ్ కార్డు ఇచ్చి “నువ్వు నాకు నచ్చావు నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానంటే ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్” అని చెప్పాడట.వారం రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి ఇలా అందరికీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి పెళ్లి చేసుకోమని అడగడమే నీ పనా అని మందలించింది.ఆ తర్వాత పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం నచ్చి ప్రేమించడం స్టార్ట్ చేసిందట.అప్పట్లో పూరి డైరెక్టర్ కాలేదు ఇది 1990 కాలంలో చోటు చేసుకుంది.అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేస్తే 2000 లోపే జీతం వచ్చేది అది అద్దెలకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి వెళ్లి పోయేది.అందువల్ల లావణ్యను బయటికి తీసుకెళ్లాల్సి వస్తే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయాల్సి వచ్చేదట.

Telugu Puri Jagannath, Lawanya, Purijagannath, Tollywood-Movie

ఒకరోజు ఆమె ఒక మంచి హోటల్ కి( Hotel ) తీసుకెళ్లిందట.అక్కడ ఒక పెద్ద తందూరీ చికెన్( Tandoori Chicken ) ఆర్డర్ చేసిందట.అప్పటికే చాలా టైట్ గా డబ్బులు ఉండటంతో పూరి భయపడ్డాడట.బిల్లు తడిసి మోపెడయితుందేమో అని.అంతేకాదు అంత పెద్ద చికెన్ ఆర్డర్ ఇచ్చింది అది ఆమె తినగలుగుతుందా అని కూడా ఈ డైరెక్టర్ ఆలోచనలలో పడ్డాడట.తాను తింటే లావణ్య ఎంత ఫుడ్ తినదో అర్థం కాదు కాబట్టి తినట్లు యాక్ట్ చేశాడట.అలా యాక్ట్ చేస్తున్న క్రమంలోనే లావణ్య చూస్తుండగానే మొత్తం కోడిని తినేసిందట.“ఓరి నాయనో ఒక్క రోజులోనే కోళ్లు తినేస్తోంది.వీళ్ళ నాన్న బాగా పెంచినట్టు ఉన్నారు.ఈమెను పెంచడం నావల్ల కాదు, ఆమెను వదిలేద్దాం.” అని అనుకున్నాడట.అదే విషయాన్ని ఆమెకు చెప్పాడట తర్వాత ఇద్దరు నవ్వుకున్నామని ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పాడు.

తన దగ్గర డబ్బులు లేవు అని నిజాయితీగా చెప్పిన లావణ్య తననే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు ఈ దర్శకుడు చెప్పాడు.ఇంట్లో ఒప్పించిన తర్వాత వీరు పెళ్లి ఖర్చులు మిగిల్చుకోవడానికి దొంగ పెళ్లి చేసుకున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసి వీరి పెళ్లికి డబ్బులు వేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube