దటీజ్ రామ్ చరణ్.. 500 మంది కోసం చరణ్ ఉపాసన చేసిన పనికి వావ్ అనాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అయినా జానీ మాస్టర్( Jani Master ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడంతోపాటు తెలుగులో ప్రసారం అయ్యే అనేక షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్.

 Jani Master About Ram Charan Upasana Health Insurance To Dancers Details, Jani M-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.కాగా హీరో రామ్ చరణ్( Ram Charan ) అంటే జానీ మాస్టర్ కు చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే.

చాలా సందర్భాలలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

Telugu Dancers, Insurance, Jani Master, Chiranjeevi, Ram Charan, Upasana-Movie

పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ జానీ మాస్టర్ కి ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడట.ఎప్పుడో అడిగిన సహాయాన్ని, ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకొని మరి సహాయం చేశాడట.దాంతో సరైన సమయంలో సహాయం చేసే వారే దేవుడు అంటూ జానీ మాస్టర్ ఒక పోస్ట్ చేశారు.

తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి తన మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాడట జానీ మాస్టర్.అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న ఉపాసన( Upasana ) వదిన తనకు ఇచ్చిన మాటకి ఆ ఉన్న సంతోషంగా కాస్తా 1000 రెట్లు పెరిగిందని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.

Telugu Dancers, Insurance, Jani Master, Chiranjeevi, Ram Charan, Upasana-Movie

తాను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని తమ డ్యాన్సర్స్ యూనియన్ టి.ఎఫ్.టి.టి.డి.ఎ లోని 500 పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్( Health Insurance ) అందేలా వారు అండగా నిలబడతామని మాటిచ్చారట.అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువ నిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదని రామ్ చరణ్‌ని ఉపాసన పై పొగడ్తల వర్షం కురిపించారు జానీ మాస్టర్.తమ అందరి మనసులో కృతజ్ఞతా భావం ఎల్లకాలం ఉంటుందని దండం పెట్టేశాడు మాస్టర్.

అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని జానీ మాస్టర్ వేసిన పోస్ట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube