న్యాచురల్ స్టార్ నానికి( Nani ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.రెమ్యునరేషన్ పరంగా కూడా నాని టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.టైర్2 హీరోలలో నాని టాప్ లో ఉన్నారు.నాని భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
దసరా,( Dasara ) హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాను నాని మార్కెట్ ను మరింత పెంచడం గమనార్హం.
అయితే న్యాచురల్ స్టార్ నాని తర్వాత మూవీ రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.దసరా మూవీ సక్సెస్ తో నానికి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కిందని తెలుస్తోంది.
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 120 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) కథను నమ్మి ఈ రేంజ్ లో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.నాని తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

నాని భవిష్యత్తు సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా నాని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే న్యాచురల్ స్టార్ నాని తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.