వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీ డైట్ లో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు( overweight ) అనేది కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు గా మారింది.మీరు ఈ జాబితాలో ఉన్నారా? వెయిట్ లాస్ అవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? నిత్యం చెమటలు చిందేలా వ్యాయామం చేస్తున్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ డైట్ లో ఉండాల్సిందే.మరింత వేగంగా బరువు తగ్గడానికి ఈ డ్రింక్ మీకు ఎంతగానో సహాయపడుతుంది.అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సైతం అందిస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 Super Drink For Weight Loss Quickly! Super Drink, Weight Loss, Weight Loss Drink-TeluguStop.com

Telugu Fitness, Tips, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Anise seeds ) వేసుకోవాలి.అలాగే రెండు దంచిన యాలకులు, పావు టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Clove powder ) వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం( Palm jaggery ) తురుము కలిపి సేవించాలి.కావాలి అనుకుంటే మీరు బెల్లం ని స్కిప్ చేయవచ్చు.

రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.

Telugu Fitness, Tips, Latest-Telugu Health

అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.బాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

ముఖంపై మొటిమలు చాలా వేగంగా తగ్గుతాయి.ముఖ చర్మం కాంతివంతంగా మెరుస్తోంది.

పిట్మెంటేషన్ సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube