సూర్యాపేట జిల్లా: సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలూ నాయక్ అధ్వర్యంలో సోమవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో నాగుల్ మిరా అనే వ్యక్తి కారులో 56 గ్రాముల బంగారం, ఐదు కేజీల వెండి విజయవాడ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా గుర్తించారు.ఈ సందర్భంగా ఎస్ఐ బాలూ నాయక్ మాట్లడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న కారును తనిఖీ చేయగా బంగారం,వెండి ఉన్నట్లు గుర్తించామని, తరలిస్తున్న వ్యక్తి వద్ద వాటికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.




Latest Suryapet News