కోదాడలో హాస్పిటల్ సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట చలం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో శుక్రవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆధ్వర్యంలో అధికారుల బృందం పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్ లో రికార్డులు పరిశీలించి పూర్తిస్థాయి అర్హత పత్రాలు సమర్పించేంత వరకు ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డిఎం అండ్ హెచ్ఓ కోట చలం తెలిపారు.

 Dr Kota Chalam The District Medical Officer Who Seized The Hospital In Kodada, D-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని ఆస్పత్రులు నిర్వహించుకోవాలని, అనుమతులు లేని ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.వైద్యులు తమ అర్హతలను,రిజిస్ట్రేషన్ నెంబర్లను విధిగా ప్రదర్శించాలని,తప్పుడు ద్రువపత్రాలు,అర్హత పత్రాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ఎప్పటికప్పుడు వ్యాధులను నిర్ధారించి ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ చేయాలని,దీనికి సంబంధించి ఇటీవల శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందంలో డాక్టర్ నిరంజన్,డాక్టర్ వెంకటరమణ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,అంజయ్య తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube