Suryapet : రోడ్డు లేక అవస్థలు పడుతున్న ఆర్ అండ్ ఆర్ సెంటర్ వాసులు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కృష్ణపట్టే ఏరియాలో పాలకవీడు మండలం గుండెబోయినగూడెం( Gundeboina Gudem ) అత్యంత మారుమూల ప్రాంతం.గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరం లో నిలిచింది.

 Suryapet : రోడ్డు లేక అవస్థలు పడుతున-TeluguStop.com

ప్రస్తుతం ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక,ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ ప్రాంత వాసులు అవస్ధలు పడుతున్నారు.పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం(ఆర్ అండ్ ఆర్ కాలనీ)కి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు 2023 అక్టోబర్ 7 న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ రూ.1 కోటి 50 లక్షలతో అప్పటి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హడావుడిగా గుండ్లపహాడ్ నుండి గుండెబోయినగూడెం వరకు బిటి రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు.కానీ,నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

ప్రస్తుత ఈ రోడ్డు మట్టితో కంకర తేలి ఐదు కిలోమీటర్ల దూరం పూర్తిగా ధ్వంసం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy )పై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube