నల్లగొండకు విస్తరించనున్న ఐటీ పరిశ్రమ...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ( IT industry ) రానున్నది.నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్ లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది.

 It Industry To Expand To Nalgonda , Nalgonda , It Industry, Sonata Software-TeluguStop.com

ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమను విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నల్గొండ ఐటీ టవర్ లో సుమారు 200 ఉద్యోగాలను సొనాటా సాఫ్ట్వేర్( Sonata Software ) కల్పించనున్నది.సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీని వీరవెల్లి మంత్రి కేటీఆర్ తో అమెరికాలోని బోస్టన్ నగరంలో సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్,ఆరోగ్య రంగం లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది.ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో కల్పించనుంది.

మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి,విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube