నూతన పార్లమెంట్ భవన నిర్మాణంపై గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు..!!

ఈనెల 28వ తారీకు నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ కార్యక్రమాన్ని 19వ విపక్ష పార్టీలు బహిష్కరించాయి.

అయితే 19 పార్టీలు బాయ్ కాట్ చేయటాన్ని ఎన్డీఏ ఖండించడం జరిగింది.ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అగౌరపరచడమేనని నీతి, రాజ్యాంగ విలువలకు తీవ్రమైన అవమానమని పేర్కొంది.

ఈ చర్య అగౌరవపరచడం కంటే పెద్దదని… మన దేశ ప్రజాస్వామ్య నీతి, రాజ్యాంగ విలువలకు తీవ్రమైన అవమానమని ఎన్డీఏ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ఆలోచన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది అని సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.1991-92లో పీవీ ఈ ప్రతిపాదన చేశారని.ఆ సమయంలో శివరాజ్ పాటిల్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారని పేర్కొన్నారు.

కొత్త భవనాన్ని నిర్మించడం మంచి పరిణామం అని తెలియజేశారు.అయితే పలు పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బాయ్ కట్ చేయటంపై తాను ఎటువంటి కామెంట్లు చేయనని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube