సూర్యాపేట జిల్లా: ఈ నెల 06వ తేదీన జరిగే తెలంగాణ జన సమితి పార్టీ ప్లీనరీనీ విజయవంతం చేయాలని విద్యార్థి జన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన సంగారెడ్డిలో తెలంగాణ జన సమితి పార్టీ రెండవ ప్లీనరీ జరుగుతుందని తెలిపారు.ఈప్లీనరీలో నిరుద్యోగ సమస్యపై, తెలంగాణ రాష్ట్రంలో రైతు సాగుపై,విద్యా వ్యవస్థపై, వైద్యంపై చర్చ ఉంటుందని అన్నారు.
తెలంగాణ జన సమితి పార్టీ ప్రతినిధులు,శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7సంవత్సరాలు గడిచినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా,రైతులకు రుణమాఫీ చెయ్యకుండా, కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.
నీళ్లు లేక బోర్లు వేసి అప్పులపాలైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు అందరికీ ఉందని,అందుకే ప్రతీ ఒక్కరూ సైనికుల్లా ప్లీనరీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బామర్ ఈశ్వర్ సింగ్,జిల్లా నాయకులు దండంపల్లి మహేష్,పోలిశెట్టి విష్ణువర్ధన్,నాయకులు చేనబోయిన మహేష్, పతాని లక్ష్మణ్,రాజశేఖర్,సతీష్,అనిల్,రాజు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.