నల్లగొండ జిల్లా: మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజూ మహిళల పట్ల విధేయత చూపాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి, డాక్టర్ స్నేహలత అన్నారు.బుధవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు వారు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా హాజరై ఆశ వర్కర్లకి శాలువాతో సత్కరించారు.
అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు జరిపి,మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి,మునిసిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు.
పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, కేతేపల్లి మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక,మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్,నకిరేకల్ మండల అధ్యక్షులు శెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, వివిధ గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.