సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఇండోర్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి.ప్రమత్తమైన అధికారులు,సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
తక్షణమే స్పందించి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మిస్ట్ జీప్ సహాయంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్,ఫైర్ మెన్ ప్రవీణ్ కుమార్ మంటలను ఆర్పివేశారు.ఈ అగ్నిప్రమాదంలో రెండు ఏసీలు,ఒక టివి కాలి బూడిద కాగా,కొన్ని ఫైల్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి.
దీనితో సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.