సూర్యాపేట జిల్లా:యావత్ భారతదేశ మహిళా లోకానికి మహాత్మా సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తిదాయకమని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి,దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా గురువారం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు సమాజంలో మహిళలు తీవ్ర వివక్షతకు గురవుతున్న సమయంలో మహిళలకు చదువు కావాలని భావించే తన సతీమణి సావిత్రిబాయి పూలేకు జ్యోతిరావుపూలే విద్యనేర్పించడం జరిగిందని అన్నారు.ఆమె నేర్చుకున్న విద్యతో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యను అందించిందన్నారు.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల్సిన అవసరముందన్నారు.వారిపై జరుగుతున్న దాడులను,అత్యాచారాలను ముక్త కంఠంతో ఖండించాలన్నారు.
మహిళలను గౌరవిస్తూ వారి ఉన్నతికి కృషి చేయడమే సావిత్రీబాయి ఫూలేకు మనం అర్పించే నిజమైన నివాళి తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నర్సింహ,పెరిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు, భూపతి నారాయణ,అక్కెనపల్లి జానయ్య,బీసీ సంఘం నాయకులు కుంచం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.