టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత నాగ చైతన్య తో విడాకుల తీసుకున్న తర్వాత తన రూటే మార్చేసింది.
వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటోంది.
ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత.ఇప్పటివరకు దాదాపుగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది ఈ బ్యూటీ.
విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.సమంతా నిత్యం ఏదో ఒక వార్తతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
సమంత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్ తో పాటుగా బిజినెస్ లో కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత మొదటి కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది.
దీనితో సమంత ఫై నెటిజన్లు, అక్కినేని అభిమానులు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇంతకు ముందే కొన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్ ను తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన సమంత తాజాగా ఒక ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది.
బ్లెండర్ ప్రైడ్ అనే ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఒక ప్రకటనలో నటించింది.ఇక అందులో సమంతా కొంచెం బోల్డ్ గా కనిపించడంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకుముందు కూడా ఇలాంటి యాడ్స్ లో నటించిన హీరోయిన్ల పై నెటిజెన్స్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ విషయం తెలిసి కూడా సమంత ఇలాంటి ప్రకటనలు నటించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఛీ ఛీ డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతావా? సార్ హీరోయిన్ అన్న సంగతి మరిచిపోయావా ? అని కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా స్టార్ హీరోయిన్ అయిన నువ్వు ఒక ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడం చాలా బాధాకరం అంటూ విరుచుకు పడుతున్నారు.
ఇక ఆ ప్రకటనలో భాగంగా వీడియోలో డ్రెస్సింగ్ విషయంలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరి ఈ విషయంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.







