దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
ఈ సినిమా గతంలోనే భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే.
మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమ నుండి మరొక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా ప్రింట్ ను R మాస్టర్ గా చేసి ఐమాక్స్ ఫార్మేట్ లోకి మార్చరట.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్స్ లో ఈ ఫార్మేట్ ప్రింట్ నే వీక్షకులు వీక్షిస్తారట.

ఐమాక్స్ ఫార్మేట్ అంటే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఫీల్ ని ఇస్తుందట.భారీ సన్నివేశాలను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఒక అద్భుతాన్ని చూసినట్టు ఫీల్ అవుతారట.ఇప్పయిట్ వరకు ఇండియా సినిమాల్లో కేవలం మూడు సినిమాలు మాత్రమే ఐమాక్స్ ఫార్మేట్ లో వచ్చాయి.ధూమ్ 3, బ్యాంగ్ బ్యాంగ్, బహుబలి 2.ఇక ఇప్పుడు నాలుగవ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ తరవాత ఈ సినిమ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం గా కనిపిస్తుంది.







