సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో,తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మామిడి హరికృష్ణ సహకారంతో,అందే మ్యూజిక్ అకాడమీ అందె గంగా జమున సారథ్యంలో ప్రదర్శించిన మహిళా డప్పు వాయిద్య ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ ను విశేషంగా ఆకట్టుకుంది.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలానికి చెందిన సతీష్ డప్పు వాయిద్యా కళా బృందం వారు చక్కటి డప్పు వాయిద్యంతో మైమరిపించే విధంగా డప్పుల కళా ప్రదర్శన ఇవ్వడం జరిగింది.
ఈ కళాబృందం నైపుణ్యానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ ఆకర్షితులై డప్పు కళాకారుడు అమరవరపు సతీష్,కళాకారుణిల బృందాన్ని శాలువాలతో సన్మానించి,వారికీ షీల్డ్ లు అందజేయడం జరిగిందని కళా బృందం తెలిపింది.ఈ కార్యక్రమంలో అజిత, యశోదా, సుగుణ,రేణుక, సైదమ్మ, సంతోష, సామ్రాట్, జ్యోతి,మైబు,జ్యోతి,చుక్కమ్మ, సుజాత,నిర్మల, ధనమ్మ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.