పేదలకు దక్కాల్సిన భూముల్లో పెద్దల పాగా

సూర్యాపేట జిల్లా:నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సాయుధ పోరాటంతో నెత్తురోడుతున్న సమయంలో సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే 1951 పర్యటనతో భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది.ఆ సమయంలో హుజూర్ నగర్ తాలూకా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో రైతులు భూదాన్ యజ్ఞ బోర్డుకు భూములు దానం చేశారు.ఆ భూములను ఫైనలైజ్ కొరకు1973లో బోర్డు సంబంధిత తాసిల్దారులకు పంపింది.1975 సీలింగ్ సమయంలో భూదాన్ భూములు రాజీనామా రిజిస్టర్ ద్వారా భూములు గుర్తించారు.1951-79 మధ్యకాలంలో భూములు ఇచ్చిన రైతుల వారసులు కొంతమంది అధికారులను అడ్డంపెట్టుకొని భూదాన్ భూములను తిరిగి పట్టా భూములుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతం కాగా మరి కొన్నిచోట్ల రికార్డులు మార్చి పట్టా భూములుగా మార్చేశారు.

 Elders Share In The Lands That Should Be Available To The Poor , Elders Share ,-TeluguStop.com

ప్రస్తుతం వాటి విలువ కోట్లల్లో ఉంది.హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల భూదాన్ భూములు భూతాల పాలయ్యాయి.

భూదాన్ ఉద్యమానికి గండికొట్టి పేదలకు ఇవ్వాల్సిన భూముల్లో పెద్దలు గద్దల్లాగా పాగావేసి భూదాన్ బినామీలు రాజ్యమేలుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్వవైభవాన్ని పునరుద్ధరించుకునే చర్యలు చేపట్టింది.

ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించి పండగ చేసుకున్నవారి ఆట కట్టించి భూముల వెలికి తీసేందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ భూదాన్ భూముల ప్రస్తావన తేవడంతో అనేకమంది స్వాతంత్ర సమరయోధులు, సర్వోదయ నాయకుల ఆశలు చిగురించాయి.ఈ క్రమంలో భూదాన్ యజ్ఞ బోర్డును ప్రభుత్వ పరం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

రెవెన్యూ యంత్రాంగం ఈ భూములపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది.కారుచీకట్లో కాంతిరేఖలా వచ్చిన స్వరాష్ట్రంలో పేదలకు భూములు ఇవ్వడానికి మనసు రాలేదు.

దీంతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు ఆగిపోయింది.భూదాన్ భూముల ఆక్రమణలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సర్వేనెంబర్ 1057 లోగల 15 ఎకరాల భూదాన్ భూములు స్వాధీనానికి శ్రీకారం చుట్టింది.ఈ మేరకు భూదాన్ యజ్ఞ బోర్డు ఆధ్వర్యంలో భూకబ్జాలకు పాల్పడిన కబ్జాదారులకు నోటీసులు జారీచేసి, మైహోమ్,కీర్తి సిమెంట్ యజమాన్యులతో పాటు మరో ఇద్దరు రైతులకు నోటీసులు జారీ చేసి, సిసిఎల్ఎ కార్యాలయంలో భూదాన్ భూముల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కబ్జాలకు గురైన సుమారు 500 ఎకరాల భూదాన్ భూముల లెక్కలు బయటికి వస్తాయని అంచనా వేస్తున్నారు.హుజూర్ నగర్ లో సర్వేనెంబర్ 1266,1424, సర్వే నెంబర్లు మొత్తం విస్తీర్ణం 25 ఎకరాలు.మేళ్లచెరువులో 1057, 1007,1267,295 సర్వే నెంబర్లలో మొత్తం విస్తీర్ణం 250 ఎకరాలు,లింగగిరిలో సర్వేనెంబర్ 308, 342 లలో విస్తీర్ణం 1.08 ఎకరాలు,పొనుగోడులో సర్వే నెంబర్ 344 విస్తీర్ణం 5 ఎకరాలు,అడ్లూరులో సర్వే నెంబర్ 307 విస్తీర్ణం 2 ఎకరాలు,కాల్వపల్లిలో సర్వేనెంబర్ 204,377 మొత్తం విస్తీర్ణం 20.32 ఎకరాలు,పత్తేపురంలో సర్వే నెంబర్ 09 విస్తీర్ణం 18.32 ఎకరాలు,రేబల్లెలో సర్వేనెంబర్ 157 విస్తీర్ణం 2 ఎకరాలు, రఘునాధపాలెంలో సర్వే నెంబర్ 239,225,238, 306,307,308,200,173,74 లలో విస్తీర్ణం 211 ఎకరాలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube