ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలకు ముఖ్యాతిథిగా హాజరైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన స్థానిక 27 వార్డ్ కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక అమరులకు ఘనంగా నివాళులర్పించారు.

 Firefighting Weeks That Started-TeluguStop.com

జిల్లా అగ్ని మాపక అధికారి సిహెచ్ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో “అగ్ని భద్రత- ఉత్పాదకత” అనే అంశంపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం తన ఎంపీ అభివృద్ధి నిధుల నుండి ఫైర్ స్టేషన్ లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేశారు.

నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేసినందుకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కి మరియు మంత్రి జగదీష్ రెడ్డికి ఫైర్ స్టేషన్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్‌ లీడింగ్‌ అధికారులు డి.శంకర్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube