సూర్యాపేట జిల్లా:తిరుమలగిరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సరైనటువంటి ప్లాన్ లేకుండా అంగడి స్థలంలో కట్టే మిషన్ భగీరథ(Mission Bhagiratha) వాటర్ ట్యాంక్ ను వెంటనే నిలిపివేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక అంగడి స్థలంలో ఆయన పర్యటించిన మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపాలిటీ ప్లానింగ్ లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆగమైపోతుందని,అంగడి స్థలంలో ఇంతకు ముందు మిషన్ భగీరథ ట్యాంకు కట్టడమే చాలా బాధాకరమని,మళ్లీ అదే స్థలంలో రెండవ నీళ్ళ ట్యాంక్ కట్టి భవిష్యత్తులో అభివృద్ధికి ఉపయోగపడే స్థలాన్ని నీళ్ల ట్యాంకులు కట్టి ఆ స్థలాన్ని దేనికి పనికిరాకుండా చేయడం కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
అంగడి స్థలం చిన్నగా ఉన్నందున మేకల సంతను ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం జరిగే స్థలంలో గొర్రెల మేకల సంతను పెట్టడం జరిగిందన్నారు.ఇంత తెలిసినా మున్సిపల్ అధికారులు మళ్లీ అదే అంగడి సంతలో రెండవ ట్యాంక్ నిర్మాణం చేయడంలో ఆంతర్యం ఏమిటని, ప్రజలందరూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ప్రజా వైద్యశాల తిరుమలగిరి(Tirumalagiri) నందు హరితహారం మొక్కలు నాటి కాంపౌండ్ వాల్ తిసి ప్రస్తుతం ఇప్పుడు అంతా విశాలమైన స్థలంలో వాటర్ ట్యాంక్ కట్టి ఆ స్థలాన్ని వేస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయమని,అట్టి స్థలం ప్రజా వైద్యశాలను భవిష్యత్తులో 50 పడకల ఆసుపత్రి చేయాలంటే ఈ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
కానీ,అక్కడ ట్యాంక్ కట్టడం వల్ల భవిష్యత్తులో 50 పడకల ఆసుపత్రి కట్టడానికి స్థలం సరిపోదని,ఇదంతా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రకారం అభివృద్ధి చేయడం లేదని,దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ స్థలం దొరకక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా దిన దినాభివృద్ధి చెందటానికి తిరుమలగిరి కి వాయుపట్టు వ్యవసాయ మార్కెట్ అని,వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్ నిర్మాణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
వ్యవసాయ మార్కెట్లో మంచి సీజన్లో ధాన్యం వస్తే రైతులు ఆ స్థలం సరిపోక ఒకపక్క ఇబ్బందులు పడుతూ ట్రాక్టర్ల మీదనే దాన్ని ఉంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తుకు చేశారు.మున్సిపల్ అధికారులు అయినా కూడా ప్రజాప్రతినిధులు ఆ స్థలములో ఫుడ్ మార్కెట్ కట్టి అసలు మార్కెట్ స్థలం కూడా చిన్నదిగా అయితే మార్కెట్ యార్డ్ కి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా ప్రజలు ఆలోచించవలసి ఉన్నది తిరుమలగిరిలో మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులు కట్టడానికి అనేకమైన స్థలం ఉందన్నారు.తిరుమలగిరిలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన టౌన్ ప్లానింగ్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
అంతేకానీ ప్లానింగ్ లేకుండా మున్సిపాలిటీ స్థలాలు వృధా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు మానుకోకపోతే మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని ఈ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.