మహిళా భరోసా సెంటర్స్ దేశానికే ఆదర్శం:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:మహిళా భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని,వేధింపులు,అత్యాచారం,నిరాదరణకు గురైన బాధిత మహిళలకు,పిల్లలకు మెడికల్, న్యాయసలహా,వైద్యం,కౌన్సిలింగ్,సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళా అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ (ఐపీఎస్) అన్నారు.

 Women's Assurance Centers Ideal For The Nation: Sp-TeluguStop.com

తెలంగాణ పోలీసు ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ యొక్క విధి విధానాలు, లక్ష్యాలు,ఉద్దేశ్యం తదితర అంశాలపై ఎస్పీ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భరోసా సెంటర్స్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డా.మమతరఘువీర్, మహిళా మరియు శిశు భద్రత పోలీసు విభాగం అదనపు ఎస్పీ అశోక్ హాజరైనారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణగా,పిల్లలపై లైంగిక దాడుల నివారణ,నిరాదరణకు,దాడులకు గురైన మహిళలకు,పిల్లలకు అండగా ఉండడం లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ ఈ భరోసా సెంటర్స్ దేశంలోనే మన రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

లైంగిక దాడులు జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.అత్యాచారం, బాలలపై లైంగిక వేధింపులు,దాడులు లాంటి కేసులు నమోదౌతున్నాయని,కేసులు నమోదు కాగానే భరోసాకు పంపించాలి.ప్రతి కేసుకు,పిర్యాదుకు భరోసా ఆన్లైన్ నంబర్ ఇవ్వడం జరుగుతుందన్నారు.కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్,లీగల్ అడ్వైసర్ అందుబాటులో ఉంటారని,బాధితులకు భరోసా అండగా ఉంటుందని తెలిపారు.

అదనపు ఎస్పీ రితీరాజ్ (ఐపీఎస్) మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు.చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదని గుర్తు చేశారు.

భరోసా సెంటర్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డా.మమత రఘువీర్ మాట్లాడుతూ భరోసా సెంటర్,అనుబంధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలని మానవ అక్రమ రవాణా,పిల్లలపై లైంగిక దాడులను నివారించాలని అన్నారు.భరోసా సెంటర్ యొక్క పని తీరు,విధి విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు.చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు,కోర్టులతో సమన్వయంగా పని చేస్తున్నామని అన్నారు.మహిళా రక్షణ భద్రతలో భాగంగా రాష్ట్ర పోలీసు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పని చేస్తుందన్నారు.మహిళలకు,పిల్లలకు భద్రత కల్పించడమే ముఖ్య ఉద్ద్యేశమని తెలిపారు.

భౌతిక దాడులను,అత్యాచార దాడులను అడ్డుకోవడం మన అందరి బాధ్యతని అన్నారు.వేధింపులకు సంబంధించి ధైర్యంగ ఫిర్యాదు చేయాలన్నారు.

జిల్లాలో భరోసా సెంటర్ నందు టీమ్ బాగా పని చేస్తుందని,టీమ్ లో మెడికల్ ఆఫీసర్,వీడియో రికార్డింగ్,కౌన్సిలింగ్, సైకాలకిస్ట్,న్యాయ సలహాదారు ద్వారా భద్రత కల్పించడం.భరోసా సెంటర్ కు జిల్లా స్థాయిలో అన్ని విభాగాల వారు అనుబంధంగా పని చేస్తున్నారన్నారు.

బాధితులకు నేషనల్ మినరల్ ఫండ్ ద్వారా చదువు, వైద్యం ఇతర అవసరాలను సైతం తీర్చుతున్నామని, స్థానిక హాస్పటల్ సహాయంతో ఇన్ పేషెంట్ విభాగంను ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని,సఖి, ఎన్ జి ఓ లాంటి ఆర్గనైజేషన్స్ తో సమన్వయంతో పని చేస్తూ బాధితులకు సెల్టర్ సైతం ఇస్తున్నామని తెలిపారు.ఈ సమావేశాని ఓడిఎస్పీలు రఘు, మోహన్ కుమార్,సిఐలు,జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ,సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రమణారావు, సువెన్ సంస్థ అధికారులు,జువెనల్ జస్టిస్,బోర్డ్ అధికారులు,మెడికల్ సూపరింటెండెంట్ మురళీధర్, డి.రవికుమార్,వెంకటేశ్వర్లు,సఖి,చైల్డ్ లైన్,బాలరక్షా భవన్ అధికారులు,భరోసా సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube