ఇండ్ల స్థలాలు అడిగితే జైల్లో పెట్టిండ్రు...!

నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని ధర్నా చేస్తూ రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని,జైలుకీకూడా పోయామని, తామేమీ బంగ్లాలు, ఎకరాలు,ఉద్యోగాలు అడగలేదని,గూడు కోసం జాగా అడుగుతున్నామని,ఇప్పటికే పట్టణంలో ఎన్టీఆర్ నగర్,రాజీవ్ నగర్ ఉందని,ఇండ్ల స్థలాలు ఇస్తే కేసీఆర్ నగర్ పెడతామనిస్థలాల సాధన సమితికి బాధితులు వాస పల్లయ్య, మాల్యాంబి అన్నారు.బుధవారం హుజూర్ నగర్ నియోజకర్గ పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఇళ్ళ స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష 11 రోజుకు చేరుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 రోజులుగా ఇళ్ళ స్థలాల కోసం దీక్ష చేస్తున్నా అధికారుల్లో కనీస స్పందన లేదని వాపోయారు.

 Dharna For Housing Sites For The Poor In Suryapet , Suryapet, Housing Sites , Dh-TeluguStop.com

నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రంలో243,244,250, 253,358,414,479 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూముల్లో తమకు ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు దీక్ష నుండి కదిలేది లేదంటూ తేల్చిచెప్పారు.ఇళ్ళ స్థలాల కోసం 2018 నుండీ పోరాడుతున్నామని,ఈ విషయంలో తమపై అక్రమ కేసులు పెట్టి,జైల్లో కూడా పెట్టిండ్రని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉండడానికి నిలువ నీడ లేని నిరుపేదలకు భూమి ఇచ్చేందుకు హద్దులు కూడా ఏర్పాటు చేశారని,కానీ,నేటికీ ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని,కలెక్టర్ కి వినతిపత్రం ద్వారా కూడా తెలియజేశామన్నారు.పది రోజుల్లో దీనిపై కమిటీ వేస్తామన్నారని,కానీ,నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని,సర్కారు భూముల్లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చేవరకు కదలేదిలేదని దీక్షను కొనసాగిస్తామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube