సూర్యాపేటలో జగదీష్ రెడ్డి రాజ్యాంగం అమలువుతుంది: సంకినేని

సూర్యాపేట జిల్లా: జిజేఆర్ కప్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తే జిల్లాలో 124 మంది ప్రభుత్వ పీఈటీలను ఎలా కేటాయిస్తారని,ప్రభుత్వ నిధులతోనే జీజేఆర్ కప్ నిర్వహించడం మంత్రి బరితెగింపుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు( Sankineni Venkateswara Rao ) అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పట్టణ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రికెట్ కిట్లు, ట్యాంక్ బండ్ లో ఉన్న స్టీమర్,రోడ్ల మీద ఉన్న జింక,ఏనుగు బొమ్మలు మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy )పై ఉన్న అవినీతి ముద్రను, వ్యతిరేకతను తగ్గించలేవన్నారు.

 Jagadish Reddy Constitution To Be Implemented In Suryapet: Sankineni-TeluguStop.com

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోట్ల రూపాయలు వసూలు చేసిన రాజకీయ లబ్ధి కోసం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పినా,నాణ్యత లేకుండా పనులు చేయడంతో గ్యాలరీ కూలి వందలాదిమంది గాయపడడానికి( వికలాంగులుగా మారడానికి) మంత్రి జగదీష్ రెడ్డి కారకులయ్యారని విమర్శించారు.మంత్రి తన పుట్టినరోజు సందర్భంగా తనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి జీజేఆర్ కప్ ను ట్రస్ట్ పేరుతో నిర్వహించుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

జీజేఆర్ కప్ నూ ట్రస్ట్ పేరు చెప్పి నిర్వహిస్తుంటే 124 మంది ప్రభుత్వ పిఈటిలను జూన్ 23 నుండి జూలై 18 వరకు ఆటల పోటీల కోసం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.ఆటల పోటీల నిర్వహణకు కూడా ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని,నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని,మంత్రి జగదీష్ రెడ్డికి చట్టం చుట్టం అవుతుందా అని ఎద్దేవా చేశారు.

మంత్రి అభివృద్ధి పేరు మీద భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీజేపీ( BJP ) నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన 4 వ వార్డు కౌన్సిలర్,అన్నారం బ్రిడ్జి గ్రామ సర్పంచ్ ల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మంత్రి ప్రభుత్వ మినరల్ ఫండ్ నిధులను కేటాయించడం జరిగిందనిఆరోపించారు.

మంత్రి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు మారిన వారికి మినరల్ ఫండ్ నిధులు ఇచ్చి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని,మినరల్ ఫండ్ ను మంత్రి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, దళిత బంధు,బీసీలకు లక్ష రూపాయల రుణం,సీఎం రిలీఫ్ ఫండ్ లు ఇప్పిస్తామని చెప్పి బీజేపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నా మాకు నష్టం జరిగేది ఏమీ ఉండదన్నారు.ఒక్క నాయకుడు వెళ్లిపోతే 10 మంది నాయకులను తయారు చేసుకుంటామని, సూర్యాపేటలో మంత్రిని ఓడించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉన్నదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube