సబ్ జైల్ కు వీఆర్ డీఆర్ సేవా సమితి వాటర్ ప్లాంట్ బహుకరణ

సూర్యాపేట జిల్లా:వర్థమాన రాజకీయాల్లో సొంత ఆస్తులు పోగొట్టుకున్న ఏకైక నాయకుడు,మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,కొప్పుల వేణా రెడ్డి,పోతు భాస్కర్ లు అన్నారు.శనివారం పట్టణంలోని సబ్ జైల్లో ఖైదీలకు మంచినీటి కొరత ఉందని సబ్ జైలర్ వినతి మేరకు మాజీ మంత్రి,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి బహుకరించిన 3 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి,పోతు భాస్కర్ లతో కలిసి ప్రారంభించారు.

 Gift Of Vrdr Seva Samiti Water Plant To Sub Jail-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంతో తెలిసీ, తెలియక చేసే తప్పులను సరిదిద్దుకునేందుకు జైల్లో గడపం మంచి అవకాశంగా భావించి,సత్పవ్రవర్తనతో మెలిగి తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని ఖైదీలకు సూచించారు.అడగగానే వాటర్ ప్లాంట్ అందించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సూర్యాపేట సబ్ జైలర్ ఉపేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube