వారం రోజులు 30 కుటుంబాలకు చీకట్లో

సూర్యాపేట జిల్లా:కోదాడ విద్యుత్ అధికారుల వింత పోకడలకు సుమారు 30 కుటుంబాలు,వారం రోజుల పాటు చీకటిలో మగ్గిపోయారు.తమ పరిస్థితి పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కు భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 30 Families In The Dark For A Week-TeluguStop.com

శనివారం ఉదయం సామాజిక కార్యకర్తలు కుదరవల్లి బసవయ్య, పొడుగు హుసేన్ లతో కలిసి జలగం సుధీర్ విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి,వారికి సంబంధంలేని విద్యుత్ బిల్లు విషయంలో వారిని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేయగా తిరిగి అధికారులు విద్యుత్ ను పునరుద్దరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ ప్రాంతంలో నివాసముంటున్న సుమారు 30 కుటుంబాలకు సంబంధం లేని నోటీసులు జారీ చేసి,2005 లో మూసివేసిన తౌడు మిల్లుపై ఉన్న సుమారు రూ.1,50,000/-బిల్లు మీరే చెల్లించాలని కరెంట్ కనెక్షన్ తీసేశారని అన్నారు.దీనితో వారం రోజులుగా మహిళలు, వృద్దులు,చిన్న పిల్లలు,విద్యార్దులు విద్యుత్ అధికారుల చర్యలకు అనేక ఇబ్బందులు పడ్డారని,ఇళ్ళల్లో కరెంట్ లేక సమీపంలోని చర్చిలో రాత్రి పూట నిద్రపోయేవారని అవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డేగ కొండయ్య,ఇర్ల శ్రీకాంత్ రెడ్డి,ఎడ్ల కోటయ్య,రచ్చ రవి,ప్రసాద్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube