సూర్యాపేట జిల్లా:బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా అందిస్తున్న చీరలు మోతె మండలంలో అనేక గ్రామాలలో పండుగ ముగిసినా నేటికీ బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కాలేదని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు విమర్శించారు.మంగళవారం మోతె మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మోతె మండలంలో అనేక గ్రామాలలో చీరల పంపిణీ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
తెల్లారితే దసరా పండుగ అని నీటికి ప్రజలకు బతుకమ్మ చీరలు అందని దుస్థితి నెలకొందని వాపోయారు.తక్షణమే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని బతుకమ్మ చీరలను పంపిణీ చేయని సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.