సూర్యాపేట జిల్లా: విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉండి ఉన్నత శిఖరాల అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జనపాటి కృష్ణయ్య అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా, సమాజంలో గొప్ప వ్యక్తులుగా రాణించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
రానున్న వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రస్థాయిలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థి, విద్యార్థులకు సూచించారు.కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు లింగం సార్ అర్థశాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేశారు.
వార్షికోత్సవ సందర్భంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.కళాశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తాహెర్ పాషా, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, పాపయ్య, రేణుక,ఆంధ్రయ్య,రమణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మద్దిమడుగు సైదులు, కవిత,లింగం,నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్,నవీన్, చీకూరి కృష్ణ,లలిత, వెంకటకృష్ణ, ప్రతాప్, రమేష్, లక్ష్మయ్య, జ్యోతి, గోపమణి, రవికుమార్, రమేష్, వీరయ్య, నాగలక్ష్మి, అధ్యాపకేతర్లు తదితరులు పాల్గొన్నారు.