సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణం తెలంగాణ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో సక్రమ,అక్రమ రవాణాకు రాచ మార్గంగా మారింది.దీనితో రాష్ట్ర సరిహద్దుల నుండి ప్రవేశించే వారిలో ఎవరు ఏ కారణంతో వస్తున్నారో అర్థం కాక నిత్యం పోలీసుల తనిఖీలు చేపట్టాల్సి వస్తుంది.
ఇందులో భాగంగా ఆదివారం కోదాడ బస్టాండ్ ఆవరణంలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో అనుమానస్పదంగా కనిపించడంతో,వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులు తనిఖీ చేయగా నిషేధిత గంజాయి లభించింది.వెంటనే వారిని అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదాడ డిఎస్పీ ఏ.రఘు వివరాలను వెల్లడించారు.గంజాయి అక్రమ రవాణా కేసులు అరెస్ట్ చేసిన నిందితులు తేదీ:13- -05-2022 శనివారం భువనేశ్వర్ నందు గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర కిలో నిషేధిత గంజాయి రూ.1500 చొప్పున ముప్పై ఆరు కిలోల గంజాయిని 54 వేలకి కొనుగోలు చేసి, రెండు బ్యాగుల్లో పెట్టుకొని ముంబైకి వయా హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు కోదాడకు చేరుకున్నారు.తేదీ:15-05-2022 ఆదివారం ఉదయం కోదాడలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ఉండడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి ముప్పై ఆరు కిలోల నిషేధిత గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.బహిరంగ మార్కెట్ నందు గంజాయి విలువ ఆరు లక్షల వరకు ఉంటుందన్నారు.
కేసులో నిందితులను పట్టుబడి చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోదాడ పట్టణ సీఐ ఏ.నరసింహారావు,పట్టణ ఎస్ఐలు నాగభూషణరావు,ఎస్.రాంబాబు మరియు ఈ కేసు నందు పని చేసిన పట్టణ పొలీస్ సిబ్బంది ఎల్లారెడ్డి, సతీష్ తో పాటు ఇతరులను అభినందించారు.నిందితుల అరెస్ట్ లో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ క్యాష్ రివార్డ్ ప్రకటించినట్లు చెప్పారు.